03-02-2026 12:10:41 AM
కేంద్ర మంత్రికి ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు సర్వీసులో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా ఉపా ధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌కి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగలి శ్రీపా ల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెట్ నిబంధన తప్పనిసరి చేస్తూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పునివ్వ డంతో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో కలిసి పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలోని విద్యాశాఖ మంత్రి కార్యాలయంలో ధర్మేంద్ర ప్రదాన్‌ను సోమవారం కలిసి వినతిపత్రం సమర్పించారు.
దీనిపై స్పందించిన కేంద్రమంత్రి సుప్రీం కోర్టు ఇచ్చిన రెండు వేర్వేరు తీర్పులలో టెట్ నిబంధనను తప్పనిసరి చేయడంతో ఈ సమస్య ఏర్ప డిందని, ఈ సమస్యను అధిగమించడానికి న్యాయపరమైన సలహా తీసుకొని చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో పీఆర్టీయూటీఎస్ నాయకులు సోమిరెడ్డి, శ్రీనివాస రెడ్డి, మిర్యాల సతీష్ రెడ్డి ఉన్నారు.