22-07-2025 01:18:35 AM
భవిష్యవాణిలో కుమారి స్వర్ణలత
ముషీరాబాద్, జూలై 21(విజయక్రాంతి) : నా భక్తులకు ఇబ్బందులు రానివ్వనని భవిష్యవాణి తెలిపే కుమారి స్వర్ణలత అన్నారు. సోమవారం లోయర్ ట్యాంక్బండ్‌లోని కనకాల కట్ట మైసమ్మ దేవాలయం, ముషీరా బాద్ శ్రీ మహాంకాళి దేవాలయంలో భవిష్యవాణి కార్యక్రమాన్ని కుమారి స్వర్ణలతచే నిర్వహించారు. ఆమె పచ్చికుండపై నిలబడి భవిష్యవాణిని వినిపించారు.
నా ప్రజలందరిని చల్లగా కాపాడుకుంటా, సుఖ సంతోషా లతో ఉంచితానని అన్నారు. ఈ యేడువర్షా లు సంమృద్ధిగా కురుస్తాయని పేర్కొన్నారు. కొంత మంది నియమ నిష్టలు పాటించకుం డా పూజలు చేస్తున్నారని నేను సంతోషంగా ఉం డాలంటే గడప గడప నుంచి సాక పెట్టి ఐదు వారాలు పూజలు చేయాలన్నారు, ధన్వంతరి హోమం, దుర్గా సప్తసతి హోమం చేయాలని అప్పుడే శాంతిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయం ట్రస్ట్ చైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్, ఈవో కే. సాంబశివరావు, ఆలయ ప్రధాన అర్చకులు సాత్విక్ శర్మ, సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణ, ముషీరాబాద్ మహంకాళి దేవాల యం ప్రధాన అర్చకులు వై. చంద్రమౌళి, దేవాదాయ శాఖ ఈవోలు మహేందర్ కుమార్, సత్యనారాయణ, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఎయిర్టెల్ రాజు, బీఆర్‌ఎస్ భోలక్ పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్ రావు, పార్టీ నాయకులు శివ మదిరాజ్, వంగాల నర్సింగ్ రావు, బాలరాజు యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జెనిగె శ్రీనివాస్ యాదవ్, పట్నం నాగభూషణం గౌడ్, లింగం గుప్తా పాల్గొన్నారు.
వైభవంగా ఫలహార బండ్ల ఊరేగింపు
ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆ యా డివిజన్‌లలో అమ్మవారి దేవాలయాల వద్ద పలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించా రు. బ్యాండు మేలాలకు అనుగుణం గా నృత్యాలు చేస్తూ భక్తులను ఎంతగానో ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఎం. అనిల్ కుమార్ యాదవ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అరవింద్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.