22-07-2025 01:20:03 AM
- రాష్ట్రంలో 16 జడ్పీ స్థానాలు గెలుస్తాం
- కాంగ్రెస్- 20 నెలల పాలన అస్తవ్యస్తం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
గజ్వేల్, జూలై 21: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ జడ్పీ స్థానాలను బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుదని, సర్వేలు కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్నాయని మాజీమంత్రి, హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌లో బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు మా ట్లాడారు. రాష్ట్రంలో 16 నుంచి 18 జిల్లా పరిషత్ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకోనుం దని ధీమా వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లాలో 26 మండలాలు ఒకటో రెండు తప్ప మిగతా అన్ని జడ్పీటీసీ స్థానాలు గెలిచి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని, గ్రామాల్లో చెత్త ట్రాక్టర్లకు తాళా లు వేశారని, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారాయని విమర్శించారు. ఎరువులు, విత్తనాలకు రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎకరానికి ఒక్క యూరి యా బస్తానే ఇస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ఉన్న రోజుల్లో రైతులు నాట్లు వేయడానికి రైతుబంధు ఇచ్చారని, కానీ సీఎం రేవంత్‌రెడ్డి ఎలక్షన్లు వస్తున్నప్పుడే రైతుబంధు వేస్తున్నాడని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో వేసవికాలంలో కూడా పంటలకు నీటిని అందించామని, గద్దర్ స్వగ్రామానికి లిఫ్ట్ పద్ధతిన సాగునీటిని అం దించినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు విద్యుత్ సరఫరా సరిగా లేక మోటారు రిపేరు చేసేవాళ్లే బాగున్నట్లు చెప్పారు. రేవంత్‌రెడ్డి పాలనలో భూముల ధరలు సగానికి పడిపోయి తెలంగాణ రెండేళ్లలోనే ఆగమైంద న్నారు.
అధికారంలోకి రాగానే మహిళలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు వరకు ఒక్కో మహిళకు రూ.50 వేలు బాకీ పడ్డారని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లాపై పగబట్టి అభివృద్ధికి నిధు లు ఇస్తలేరని ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో ప్రభు త్వం ఇంకా తేల్చలేకపోతుందని, వాళ్లకు అభ్యర్థులు కూడా కరువయ్యారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. మండలాల వారిగా, గ్రామాల వారిగా ఇన్చార్జిలు నియమిస్తామని చెప్పారు.
ప్రతిపక్షాలపై నోరు పారేసుకొనే సీఎంకు ఫుడ్ పాయిజన్ ఘటనలు కనిపిస్తలేవా?
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ప్రతిపక్షాలపై నోరు పారేసుకొనే సీఎంకు రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్‌లతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుప త్రి పాలవుతుండటం కనిపించడం లేదా అని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ గుర్తులు చెరిపేయాలన్న లక్ష్యంతో రేవంత్ గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండటం చారిత్రాత్మక నేరమని సోమవారం ఆయన ఎక్స్ వేదికగా విమర్శించారు. సంకుచిత మనస్తత్వంతో దళిత, గిరిజన, బడుగు, మైనార్టీ వర్గాల పిల్లలు చదువుకొనే గురుకులాల ఖ్యాతికి గ్రహణం పట్టిస్తుండటం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు.
స్వయాన మానిటరిం గ్ చేస్తానని బీరాలు పలికిన సీఎం మీ మానిటరింగ్ ఏమైందని, విద్యాశాఖ మంత్రిగా, సీఎంగా మీరు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప, రాష్ట్రం లో పరిపాలనను చక్కదిద్దడం చేతాగాదా, 20 నెలల కాంగ్రెస్ పాలనలో పాము కాట్లు, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్‌లతో 100కు పైగా గురుకుల విద్యార్థులు ప్రాణా లు కోల్పోతే.. ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీ ఆర్ గురుకులాలను ఎవరెస్ట్ శిఖ రం ఎత్తున నిలబెడితే, రేవంత్ అధో:పాతానికి దిగజార్చారని మండిపడ్డారు. ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతే మీ రాతి గుండె కరుగుతుందని, ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం పాఠశాలలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.