2 July, 2026 | 3:45 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

నేను గెలిస్తే ఆ రహస్య పత్రాలు బయట పెడతా: ట్రంప్

05-09-2024 12:16 AM

న్యూయార్క్, సెప్టెంబర్ 4: అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో తాను గెలిస్తే పలు రహస్య పత్రాలను బయట పెడతానంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కాస్ట్ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడుతూ తాను వైట్‌హౌస్‌లో అడుగుపెడితే మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ మర్డర్‌కు సంబంధించిన పత్రా లు, ఎప్‌స్టున్ ఫైల్స్, యూఎఫ్‌వో దృశ్యాలు లాంటి రహస్యాలను బహిర్గతం చేస్తానన్నారు. ఈ పత్రాలను విడుదల చేయొద్దం టూ చాలా మంది తనతో చెబుతున్నారని, కానీ నేనెవరి మాట వినే ప్రసక్తి లేదన్నారు. మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ కుటుంబానికి చెందిన రాబర్ట్ జాన్ ఎఫ్ కెన్నడీ జూనియర్ అమెరికా అధ్యక్ష బరిలో నిలవాలని భావించారు.

కానీ ఆయన ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకొని ట్రంప్‌కు మద్ద తు ప్రకటించారు. దీని కోస మే మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ మర్డర్ ఇన్వెస్టిగేషన్ తాలుకూ ఫైల్స్‌ను విడు దల చేయడానికి ట్రంప్ సిద్ధపడినట్లు తెలిస్తోంది. డెమొక్ర టిక్ పార్టీకి చెందిన కెన్నడీ కుటుంబ సభ్యు లు.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపడం ఇదే తొలిసారి. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టున్ కేసు పత్రాలపై సైతం ట్రంప్ స్పందిస్తూ తనకు ఆ కుంభకోణంలో భాగస్వామ్యం లేదని, అతడి లాగ్జరీ స్ ద్వీపానికి వెళ్లిన కొంతమంది ప్రముఖులను కాపాడేందుకే ఆ జాబితాను రహస్యం గా ఉంచుతున్నారన్నారు. అదృష్టవశాత్తు ద్వీపానికి తాను వెళ్లలేదని పేర్కొన్నారు.