పురిటిగడ్డ రుణం తీర్చుకుంటా
ఎంపీ వేం నరేందర్ రెడ్డి
కేసముద్రం, మే 13 (విజయక్రాంతి): కేసముద్రం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి పురిటిగడ్డ రుణం తీర్చుకుంటానని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పర్యటనకు వచ్చిన ఆయన, కేసముద్రం మండలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్‌తో కలిసి పరిశీలించారు.
ఇంటిగ్రేటెడ్ పాలిటెక్నిక్, 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులతో పాటు వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా తన ఎదుగుదలకు వేదికగా నిలిచిన సొంత మం డలాన్ని భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధికి ఎదురు చూడకుండా మౌలిక వసతులు ఏర్పాటు చేసి, ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
అభివృద్ధి పనుల్లో ఎక్కడ కూడా రాజీ పడకుండా, నాణ్యతలో పించకుండా, భవిష్యత్తు తరాలకు కూడా ఇ బ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆ దేశించారు. ఈ ప్రాంత ప్రజలకు విద్య, వైద్య, రహదారులు, విద్యుత్, ఇతర సౌకర్యాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అల్లం నాగేశ్వర రావు, అంబటి మహేందర్ రెడ్డి, రావుల ము రళి, నీలం దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.






