అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా
మాజీ మంత్రి హరీష్‌రావుకు మంత్రి అడ్లూరి సవాల్
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): గురుకులాలకు సంబంధించి విద్యార్థుల బుక్స్, యూనిఫామ్, కిరాణం, ఇతర వస్తువుల టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, నిరూ పించకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతావా? అని మాజీమంత్రి హరీష్‌రావుకు మంతి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. స్థలం నువ్వే చెబితే అధికా టరులతో కలిసి అక్కడికి వస్తామని మంత్రి స్పష్టం చేశారు.
హరీష్‌రావు రూ.2 వేల కోట్ల కుంభకోణమని, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రూ.3 వేల కోట్లని, వారి అనుబంధ మీడియా రూ.200 కోట్ల వ్యవహారమని నిజమైన అంకెఏదో మీకే క్లారిటీ లేకపోతే ప్రజలు ఎలా నమ్మాలని మంత్రి అడ్లూరి నిలదీశారు. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టెండర్లన్నీ పాదర్శకంగానే జరిగాయని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతికి అస్కారం లేదని, గడీల పాలన సాగించడం లేదని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ హయాంలో ఏ ఫైల్ అయినా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లలేదా? అని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి అశంపై మంత్రులతో కలిసి సమీక్షించి, నిర్ణయాలు తీసుకుంటున్నారని, హరీష్‌రావు సానుభూతి అక్కర్లేదన్నారు.






