17 June, 2026 | 3:42 AM

వ్యక్తి మృతి కేసులో నిందితుడు అరెస్టు

17-06-2026 02:43 AM

మనోహరాబాద్, జూన్ 16: ఇరువురి మధ్య వాగ్వివాదంలో వ్యక్తి మృతికి కారణమైన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తూప్రాన్ సీఐ వెంకట రాజాగౌడ్ తెలిపారు. మండలంలోని కాళ్లకల్ గ్రామానికి చెందిన గంగిడి నరసింహారెడ్డి(50) మృతి చెందిన కేసులో నిందితుడు పూర్ణ స్వామిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఫిబ్రవరి 17న కాళ్ళకాల్ గ్రామంలోని కల్లు దుకాణం వద్ద నరసింహారెడ్డి తన మామ వరగంటి రాములును తిడుతున్న విషయమై వాగ్వాదం జరుగగా నరసింహారెడ్డిని నెట్టివేయగా కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 15న మృతి చెందగా నిందితుడు పూర్ణ స్వామిని అరెస్టు చేసినట్లు తెలిపారు.