17 June, 2026 | 3:47 AM

రైతులకు రూ.826.34 కోట్ల చెల్లింపులు

17-06-2026 02:42 AM

కలెక్టర్ ప్రతిమాసింగ్ 

మెదక్, జూన్ 16: మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి అంకంలో ఉందని, ఇప్పటి వరకు రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యంకు రూ.826.34 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 93,373 మంది రైతుల నుంచి  4,08,008,480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, అందులో 79,147 మంది రైతులకు 826.34 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 473 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసి వేశామన్నారు. రైతులు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞపి చేశారు. ధాన్యాన్ని చివరిగింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు.