calender_icon.png 16 January, 2026 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తా

15-01-2026 12:40:52 AM

బీజేపీ మున్సిపల్ కన్వీనర్ గా నర్సంపల్లి రాజిరెడ్డి 

గుమ్మడిదల, జనవరి 14 :గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో బిజెపి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేలా శాశశక్తుల కృషి చేస్తానని మున్సిపల్ బిజెపి నూతన కన్వీనర్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన నర్సంపల్లి రాజిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను మున్సిపల్ పరిధిలోని గ్రామాలలో ఇంటింటికీ తీసుకువెళ్లి బిజెపి పార్టీ ప్రతిష్టను పెంపొందించడానికి కృషి చేస్తానని తెలిపారు.

ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త నుండి నాయకుల వరకు ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతల యాదగిరి, బి.రాఘవరెడ్డి, ఐలేష్, రవీందర్ రెడ్డి, రామ్ రెడ్డి, రాజు, సత్యనారాయణ, ఉదయ్ కుమార్, సీనియర్ నాయకులు, శక్తి కేంద్రాల ఇన్చార్జిలు, బూత్ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.