కిష్టాపూర్‌లో ముగ్గుల పోటీలు
15-01-2026 12:41 AM
తూప్రాన్, జనవరి 14 :తూప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బుధవారం గ్రామ పంచాయతీ ఆవర ణలో గ్రామంలోని మహిళలు చిన్నారులతో కలిసి ముగ్గుల పోటీలు గ్రామ సర్పంచ్ హిమబిందు శ్రీశైలం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో గెలుపొందిన విజేతలకు సర్పంచ్ చేతుల మీదుగా బ హుమతులను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బి రవి, పాలకవర్గం సభ్యులు ఎం. రాజు, సురేష్ గౌడ్, టి. రాజు, చుక్క రవి, చుక్క స్వామి, ఎం. కుమార్, డి శ్రీశైలం, శ్రీను, నాగరాజు, లతీపుద్దిన్, గోపి కరుణాకర్, కుమ్మరి స్వామి, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.




