12 August, 2026 | 8:54 AM

ముఖ్యమంత్రితో మాట్లాడుతా!

12-08-2026 01:39 AM

ఓపీఎస్ అమలుపై ప్రభుత్వం ఆలోచిస్తుంది: మంత్రి శ్రీధర్‌బాబు హామీ

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): ఓపీఎస్ (ఓల్డ్ పెన్షన్ స్కీం) అమలు గురించి ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుందని, తప్పకుండా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బా బు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తాను మాట్లాడుతానని ఉద్యోగులకు ఈమేరకు ఆయన హామీ ఇచ్చారు. సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధులు మంగళవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ని హైదరాబాద్‌లో వేర్వేరుగా కలిసి సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారికి వినతి పత్రం సమర్పించారు.