02-11-2025 03:15:37 PM
తుంగతుర్తి (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నాయకులు సందు వినోద్ తల్లి సందు ఎల్లమ్మ కొన్ని రోజుల నుండి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరణించడంతో, ఎల్లమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి ధైర్యం చెప్పి కొంత ఆర్థిక సహాయం ఇచ్చి, మీకు అండగా ఉంటానన్నారు. నాన్నగారి బాటలో ముందుకు నడుస్తానని ప్రతి కార్యకర్త నాకు సహకారం ముఖ్యమని అన్నారు.