calender_icon.png 2 November, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి

02-11-2025 03:19:46 PM

ఉచిత చేప పిల్లల పంపిణీ: నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్,(విజయక్రాంతి): మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం పెద్ద చెరువులో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లలను చెరువులోవదిలారు. ఈ‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియెజకవర్గ వ్యాప్తంగా 223 చెరువుల్లో 1 కోటి 05 లక్షలు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉచిత చేప పిల్లల పంపిణి కార్యక్రమాన్ని మత్సశాఖ సోసైటి సభ్యులు వినియోగించుకోవాలని ఆయన  సూచించారు. మత్స్యకారులకు వలలు, ఇతర పరికరాలు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి,  నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత  శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు,  కౌన్సిలర్లు ,నాయకులు  పన్నాల రాఘవరెడ్డి, గాజుల సుకన్య యాసారపు వెంకన్న, మట్టిపల్లి వీరు, కొండ వెంకన్న గౌడ్, లక్ష్మీనారాయణ, మత్సశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.