calender_icon.png 1 December, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎం శ్రీ మండల స్థాయి పాఠశాల టోర్నమెంట్

01-12-2025 05:57:19 PM

గుండాల (విజయక్రాంతి): యాదాద్రి జిల్లా విద్యాధికారి ఆదేశానుసారం గుండాల మోడల్ స్కూల్ లో పీఎం శ్రీ పాఠశాల స్థాయి క్రీడలను పాఠశాల క్రీడా మైదానంలో సోమవారం ప్రిన్సిపాల్ జి రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్-17 లెవెల్ బాలబాలికలు కబడ్డీ, కోకో, వాలీబాల్, ఫుట్ బాల్ అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి పంపుతామని తెలిపారు. చదువుతో పాటు క్రీడలలో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.