అనాథ పిల్లలకు అండగా ఉంటా
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, మార్చి 13 (విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని నవోదయ నగర్ కు చెందిన ఆత్రం గంగుబాయి ఆడబిడ్డ కు జన్మనిచ్చి ఇటీవల మృతి చెందారు. ఐతే నాలుగు నెలల క్రితం గంగుబాయి భర్త సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. పసికందు తల్లిదండ్రులు చనిపోయిన విష యం తెలిసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్న పిల్లలకు అండగా ఉంటా నని వారికి హామీ ఇచ్చారు.
తనవంతుగా రూ.5,000 నగదుగా అందజేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... చిన్నారి ఎదిగే వరకు పాలు పోషణ ఖర్చులు మొ త్తాన్ని తానే భరిస్తానని కుటుం బ సభ్యులకు హామీ ఇచ్చారు. పిల్లల సంరక్షణలో ఏలాంటి అవసరం ఉన్న తనకు తెలుపాలని వారికి సూచించారు. అదేవిధంగా ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఉపాధ్యాయుడు బలిరాం ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




