మంచివాడిగా ఉండను: ట్రంప్
30-04-2026 01:34 AM
సోషల్ మీడియాలో గన్ చేతబూనిన ఫొటోతో వార్నింగ్
వాషింగ్టన్, ఏప్రిల్ 29: ఇక మీదట తాను మంచివాడిగా ఉండనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఎకె చేతబూనిన ఓ చిత్రాన్ని విడుదల చేస్తూ పేర్కొన్నారు. అణు కార్యక్రమానికి సంబంధించి దౌత్యపరమైన పరిష్కా రం త్వరలో లభించకుంటే అమెరికా ఇరాన్‌పై కఠిన వైఖరి తీసుకుంటుందన్నారు. ఇరాన్ తెలివిగా వ్యవహరిస్తే మంచిదన్నారు. చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించలేకపోతుందని, అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియడం లేదని అన్నారు. ‘ఇకమీదట అంత మంచివాడిగా ఉండను’ అని ట్రంప్‌పేర్కొన్నారు. అమెరికా ప్రతిపాదనలు తిరస్కరిస్తే తాము మరింత దూకుడుగా వ్యవహరిస్తామని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారని నిపుణులు పేర్కొంటున్నారు.






