calender_icon.png 4 February, 2026 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబొమ్మ రవికి హైకోర్టులో చుక్కెదురు

04-02-2026 01:34:23 AM

  1. బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా
  2. సీసీఎస్‌లో నమోదైన నాలుగు కేసుల్లో బెయిల్ కోరిన నిందితుడు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): సినీ పైరసీ లోకంలో సంచలనం సష్టించిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహ కుడు ఇమంది రవికి హైకోర్టులో ఊరట లభించలేదు. సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన నాలుగు వేర్వేరు కేసుల్లో తనకు బెయి ల్ మంజూరు చేయాలని కోరుతూ రవి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను న్యా యస్థానం వాయిదా వేసింది.

మంగళవారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయి దా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రవి మరికొద్ది రోజులు జైలులోనే గడపాల్సి ఉంది. ప్రస్తుతం నిందితుడు చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

పోలీసులకే సవాల్ విసిరి.. చివరికి ఇలా..

దేశ విదేశాల్లో సర్వర్లు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఏకంగా పైరసీ సా మ్రాజ్యాన్నే నిర్మించిన రవి.. సినీ పరిశ్రమకు కొరకరాని కొయ్యగా మారిన విష యం తెలిసిందే. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ఒకానొక దశలో నన్ను పట్టుకో వడం మీ వల్ల కాదంటూ పోలీ సులకే సవాల్ విసిరాడు. అయితే, సైబర్ క్రైమ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఒక ఈమెయిల్ లింక్ ఆధారంగా నిఘా పెట్టి, రవి హైదరాబాద్‌కు వచ్చినట్లు నిర్ధారించుకుని అరెస్టు చేశారు.

ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా రవి కోట్లాది రూపాయలు ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, విదేశాల్లో దాచిన డేటా, సర్వర్ల వివరాలు, అక్కడి నెట్‌వర్క్ గురించి పోలీసులు విచారిస్తున్నా.. రవి సమాధానాలు దాటవేస్తున్న ట్లు సమాచారం. ఈ క్రమంలో బెయిల్ కోసం రవి చేస్తున్న ప్రయత్నాలకు హైకోర్టులో తాత్కాలిక బ్రేక్ పడింది. శుక్రవారం నాటి విచారణలో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.