13 July, 2026 | 9:43 PM

Breaking News

డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •  

పాక్ మ్యాచ్ బహిష్కరణపై ఐసీసీ ఆందోళన

02-02-2026 12:50 PM

2026 టీ20 ప్రపంచ కప్‌కు(World Cup) సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ జట్టు టీ20 టోర్నమెంట్‌లో(T20 Tournament) పాల్గొన్నప్పటికీ, భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 15న కొలంబోలో గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్ తలపడాల్సి ఉంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుండి తొలగించిన నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం(Pakistan Government) ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రతిస్పందనగా, ఐసీసీ పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది, ఇందులో భాగంగా ఆ జట్టును ఈవెంట్‌లో పాల్గొనకుండా నిషేధించే అవకాశం కూడా ఉంది. టీ20 ప్రపంచ కప్(T20 World Cup) వివాదం భారత్-పాకిస్థాన్ ఇద్దరికీ నష్టమేనని విశ్లేషకులు తెలిపారు. 

పాకిస్థాన్ నిర్ణయంపై ఐసీసీ ఆందోళన

భారత్ తో మ్యాచ్ ను పాక్ బహిష్కరించటంపై ఐసీసీ(International Cricket Council) ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం తమ దృష్టికి వచ్చిందని ఐసీసీ వర్గాలు తెలిపాయి. పీసీబీ నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని ఐసీసీ వెల్లడించింది. టీ 20 వరల్డ్ కప్ లో భారత్(India vs Pakistan)తో మ్యాచ్ ను బహిష్కరించటం సరికాదని ఐసీసీ సూచించింది. పాక్ ప్రభుత్వ నిర్ణయం ప్రపంచ క్రీడా నియమాలకు విరద్ధమని ఐసీసీ హితవు పలికింది. ఎంపిక చేసిన మ్యాచ్ లే ఆడాలనే పాక్ వైఖరి ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. పాక్ నిర్ణయం క్రికెట్ ఫ్యాన్స్(Cricket fans), ఆదేశ అభిమానులకు మంచిది కాదని తెలిపింది. పాక్ ప్రభుత్వం నిర్ణయం.. ఆ దేశంలో క్రికెట్ పై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని ఐసీసీ పేర్కొంది.