calender_icon.png 2 February, 2026 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుదిరినట్టేనా?

02-02-2026 12:00:00 AM

  • తిలక్ వర్మ రీఎంట్రీ
  • బౌలింగ్‌పైనే కాస్త టెన్షన్
  • మెగాటోర్నీకి ఫైనల్ 11పై సస్పెన్స్ 
  •  ఓపెనర్‌గా ఇషాన్ కిషన్

* న్యూజిలాండ్ సిరీస్ ముగిసింది. ఊహించినట్టుగానే సొంతగడ్డపై టీ ట్వంటీ ఫార్మా ట్‌లో తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన టీమిండియా 4-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. నాలుగో టీ ట్వంటీ ఓటమి తప్పిస్తే మిగిలిన మ్యాచ్‌లలో భారత్ అదరగొట్టింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు కివీస్ పై సిరీస్ విజయం ఖచ్చితంగా జోష్ పెంచేదే. కానీ భారత తుది జట్టు కూర్పుపై క్లారిటీ వచ్చినట్టేనా.. ఇంకా మన జట్టు మెరుగవ్వాల్సిందే ఏదైనా ఉందా.... బౌలింగ్ సంగతేంటి... ? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు వేధిస్తున్నాయి. 

హైదరాబాద్, ఫిబ్రవరి 1 : భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ ప్రపంచకప్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ మెగాటోర్నీకి ముందు భారత్ చివరి సన్నాహాక సిరీస్ కూడా ఆడేసింది. అంచనాలను నిలబెట్టుకుంటూ న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. అయి తే తుది జట్టు కూర్పులోనూ, ఇంకా బౌలింగ్ పరంగానూ కొన్ని ఇబ్బందులు మాత్రం కనిపిస్తున్నాయి. వీటిలో ముందు చెప్పుకోవాల్సింది  ఓపెనింగ్ కాంబినేషన్ గురించే.. గిల్ ఫామ్‌లో లేడని తప్పించి సంజూ శాంసన్‌కు చోటు కల్పించారు.

కానీ సిరీస్ ఆద్యంతం సంజూ నిరాశపరిచాడు. ప్రస్తుతం ఉన్న ఆప్షన్లలో ఇషాన్ కిషన్ సంజూ ప్లేస్‌ను భర్తీ చేసే అవకాశముంది. దీనిపై మేనేజ్ మెంట్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఒక్కటి మాత్రం అటు ఫ్యాన్స్‌కు, ఇటు మేనేజ్ మెంట్‌కు ఉత్సాహాన్నిస్తోంది. అదే ఇషాన్ కిషన్ సూప ర్ ఫామ్. సరిగ్గా ఏడాది క్రితం జట్టులో చోటే లేదు. సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. అలాంటిది మళ్లీ దేశవాళీ క్రికెట్ రాణించి ఇప్పుడు మెగాటోర్నీకి కీలకంగా మారిపోయాడు.

ఇదిలా ఉంటే కివీస్‌తో సిరీస్ ద్వారా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోవడం మరో సానుకూలాంశం. వరల్ కప్ లోనూ ఇదే జోరు కొనసాగిస్తే అంతకంటే ఏం కావాలి. మరోవైపు బౌలింగ్ పరంగా మాత్రం కొంచెం ఆందోళన కనిపిస్తోంది. పేసర్లు, స్పిన్న ర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బుమ్రా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ వికె ట్లు తీస్తున్నా ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నారు.

నిజానికి బ్యాటింగ్ పిచ్‌లు కావడం తో బౌలర్లను పూర్తిగా తప్పుపట్టలేకున్నా ఇలాంటి పిచ్‌లపై అదరగొడితేనే కదా ప్రత్యర్థి జట్లకు మన సత్తా తెలుస్తుందని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈనేపథ్యంలో మెగాటోర్నీ కి ముందు బౌలింగ్ ఒక్కడే కాస్త మెరుగుపరుచుకోవాల్సిన అంశంగా చెప్పొచ్చు. ఇక గాయాల బారిన పడ్డ తిలక్ వర్మ కోలుకోవడం జ ట్టుకు పెద్ద అడ్వాంటేజ్.

అటు ఫీల్డింగ్‌లోనూ కొన్ని లోపాలు ఈ సిరీస్ ద్వారా బయటపడ్డాయి.  ఒక్క క్యాచ్ చేజారినా మ్యాచ్ కూడా చేజారిపోయే అవకాశముంటుం ది. ఉపఖండపు పిచ్‌లు, మం చు ప్రభావం ఉండనుండడంతో ఫీల్డింగ్ సవాల్‌తో కూడుకున్నదే. ఈ సవాల్‌ను అధిగమించిన జట్టుకే గెలుపు అవకాశాలుంటాయి.