వన్డే, టీ20ల్లో మనమే నంబర్‌వన్
దుబాయ్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌కు ముందు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించింది. శుక్రవారం ఐసీసీ విడుదల చేసిన తాజా వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా నంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ (264), ఆస్ట్రేలియా (257), ఇంగ్లండ్ (252) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక వన్డేల్లో భారత్ 122 పాయింట్లతో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.
భారత్ కంటే 6 పాయింట్లు వెనుకబడి 116 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా (112), పాకిస్థాన్ (106), న్యూజిలాండ్ (101) వరుసగా ఆ తర్వాతి ర్యాంక్‌ల్లో నిలిచాయి. టీమిండియా వైట్‌బాల్ ఫార్మాట్‌లో నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ రెడ్‌బాల్ ఫార్మాట్ (టెస్టులు)లో మాత్రం అగ్రస్థానాన్ని ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఆస్ట్రేలి యా 124 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. 120 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ (105), సౌతాఫ్రికా (103) వరుసగా మూడో, నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023 పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.






