ఆదర్శ రైతు కూసం రాజమౌళి
సంతాప సభలో వక్తలు
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బు ధవారం గంగాదేవిపల్లి ఆదర్శ గ్రామ మార్గదర్శి కూసం రాజమౌళి, వాయుపుత్ర ఎంట ర్‌ప్రైజెస్ యజమాని కస్తూరి రాజు, హమాలి కార్మికుడు గాదం శ్రీనుల సంతప సభ ఏర్పాటు చేశారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ..
కూసం రాజమౌళి ఆదర్శ రైతుగా పేరు ప్రఖ్యాతలు పొంది, ఊకల్ సొసైటీ చైర్మన్‌గా రైతులకు విశిష్ఠ సేవలు అందించారని గుర్తు చేశారు. గంగాదేవిపల్లి గ్రామం దేశంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది ప్రపంచవ్యాప్తంగా గుర్తుచేసుకునే విధంగా పేరు ప్రఖ్యాతలు సాధించారని చెప్పారు.
సంతాప సభలో వరంగల్ ఛాంబ ర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అన్ని విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు, గుమస్తా, హమా లి, దడువాయి, ఎడ్లబండ్ల, మోత, కటాయింపు ఇతర కార్మికులు తదితరులు పాల్గొన్నారు.




