29 July, 2026 | 9:56 PM

Breaking News

బురదలో చిక్కుకున్న ఆర్టిసి బస్సు   •   ఓటు హక్కు అమూల్యం.. దరఖాస్తులో జాప్యం వద్దు   •   భద్రాద్రిలో ఘనంగా పోకల దమ్మక్క సేవ యాత్ర   •   శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి   •   బాలుర వసతి గృహంలో విద్యార్థులకు ప్లేట్లు, నోట్‌బుక్స్ పంపిణీ   •   విశ్వబ్రాహ్మణ సంఘం గుండి గ్రామ కమిటీ ఏర్పాటు   •   సిఐ నీలం రవికి ఘన సన్మానం   •   మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •  

రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవు

20-05-2026 12:08 AM

తుంగతుర్తి, ఏప్రిల్ 19 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు బస్తాలో కాంటా పెట్టిన ధాన్యాన్ని మిల్లులకు పంపిణీ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తప్పమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో పాటు, ఆత్మకూరు (ఎస్), నాగారం మండలాల్లోని పలు ఐకెపి ధాన్యం కేంద్రాలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు.

సూర్య తండ మాజీ సర్పంచ్ నాకావత్ యాకో నాయక్ తమ గ్రామంలో బస్తాల్లో కాంటా పెట్టి ఉండమని లారీ లేక ధాన్యం రవాణా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధింత అధికారులతో మాట్లాడి లారీలు వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు పంపిన ధాన్యాన్ని, మిల్లర్లు యాజమాన్యం ఇష్టరాజ్యంగా కటింగ్ చేస్తే చర్యలు తప్పవు అన్నారు.

స్టేడియంలో నిలువ ఉన్న ధాన్యపు బస్తాలను లారీ పిలిపించి తక్షణమే బస్తాలను ఎగుమతి చేయించిన కలెక్టర్, దీనితో రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు, వేసవి తాపంతో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, లారీలు తెప్పించి ఎగుమతి చేయాలని కోరారు. ఆయన వెంట జిల్లా ఉన్నతాధికారులు,  మండల అధికారులు తాసిల్దార్ దయానందం, ఏ డి ఏ రమేష్ బాబు, ఎంపీడీవో శేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.