29 August, 2026 | 12:09 PM

చినుకు పడితే చీకటే

11-06-2024 12:20 AM

మహానగరానికి తప్పని కరెంట్ కోతలు

చెట్టు కొమ్మలతో విద్యుత్ తీగలకు ముప్పు

షార్ట్‌సర్క్యూట్‌తో పవర్ కట్

విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు 

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వానొచ్చిందంటే చాలు రహదారులన్నీ జలమయం అవుతాయి. ట్రాఫిక్ జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు. విద్యుత్ సరఫరాలో అంతరాయం. నగరంలో ఈ మూడు అంశాలపై వర్షం తీవ్ర ప్రభావం చూపు తుంది. దీంతో వర్షం వచ్చిన ప్రతిసారీ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా గాలి, దుమారం, ఈదురు గాలులతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు ఒరిగి పోతున్నాయి. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడుతూ సరఫరా ట్రిప్పు అవుతుం ది. ఫలితంగా విద్యుత్ సరఫ రాకు తరుచూ అంతరాయం కలుగుతుంది. 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 10 (విజయక్రాంతి) : గ్రేటర్‌లో కొద్ది పాటి వర్షం వచ్చి రోడ్లపై నీరు నిలిచినా, చెట్లు విరిగి పడిపోయినా, వరదలకు నాలాలు పొంగినా, బస్తీలు, కాలనీలలో ప్రజలు ఇబ్బందులకు గురవుతు న్నా.. జీహెచ్‌ఎంసీ టోల్ ఫ్రీ 21111111 నంబరుకు ఫిర్యాదులు అందుతాయి. ఈ ఫిర్యాదుల మేరకు జీహెచ్‌ఎంసీ డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతూ స్థానికంగా నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.

ఇదిలా ఉండగా, మే నెల 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ జీహెచ్‌ఎంసీకి మొత్తం 806 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలియజే శారు. వీటిలో చెట్లు పడిపోయిన ఫిర్యాదులే 625 ఉండటం విశేషం. అత్యధికంగా ఖైరతాబాద్‌లో 155, శేరిలింగంపల్లిలో 117, సికిం ద్రాబాద్‌లో 102, కూకట్‌పల్లిలో 94, ఎల్‌బీ నగర్‌లో 83, చార్మినార్‌లో 74 ఫిర్యాదులు అందాయి.  అంతే కాకుండా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సైతం ప్రతి రోజూ కనీసం 30 నుంచి 50కి పైగా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిలో చెట్లు కూలిపోవడం, రోడ్లపై నీరు నిలిచిపోవడం వంటి అంశాలే ప్రధానంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో చెట్లు విరిగినా, కొమ్మలు తెగి విద్యుత్ లైన్లపై పడిపోయినా తక్షణమే సరఫరాకు అంతరాయం కలుగుతుంది. 

మే నెలలోనే వర్షాలు

వాస్తవానికి వేసవి కాలం సమీపించగానే విద్యుత్ శాఖ ‘ప్రీ మాన్‌సూన్’ చర్యలు చేపడుతుంది. ఎక్కడెక్కడ విద్యుత్ లైన్లలో సమ స్యలు ఉన్నాయి. ఎక్కడ సమస్యలు ఉత్ప న్నం అయ్యే అవకాశం ఉంది. లైన్లలో ఏమై నా లోపాలు ఉన్నాయా లేదా అనే విషయాలను చెక్ చేస్తూ .. లోపాలను సరి చేయాల్సి ఉంటుంది. విపరీతమైన వేసవి ప్రతాపం చూపించాల్సిన మే నెలలో నగరంలో 13 సెం. మీటర్ల వర్షపాతం కురిసిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కురు స్తున్న వర్షాలు 8 సెం.మీటర్ల నుంచి 10 సెం.మీటర్ల దాకా కుండపోత వర్షం కురుస్తుంది. కానీ, ఈ ఏడాది మే నెలలోనే విపరీ తమైన వర్షాలు కురవడంతో విద్యుత్ శాఖ చేపట్టాల్సిన ప్రీమాన్‌సూన్ చర్యలు అరకొరగానే చేపట్టినట్టు విమర్శలు ఉన్నాయి. దీంతో ఏ రోజు వర్షం కురిసినా తక్షణమే విద్యుత్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్టుగా పలువురు భావిస్తున్నారు.  

అధికారులకు తలనొప్పిగా..

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తరుచూ విద్యుత్ సరఫరాలో వచ్చే అంతరాయాలు విద్యుత్ శాఖ అధికారులకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కురుస్తున్న వరుస వర్షాలకు విద్యుత్ స్తంభాలు నెలకొరిగిపోవడం, చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడిపోవడం కారణంగా సరఫరా నిలిచిపోతుంది. ఈ సమస్య ఒకే సమయంలో పలు చోట్ల వస్తున్న కారణంగా మరమ్మత్తులు జరిగేందుకు తీవ్రమైన జాప్యం జరుగు తుంది.

గంటల తరబడి విద్యుత్ సరఫరా లేకపోవడం కారణం గా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయ డం, దీనిని సాకుగా తీసుకుని విపక్షాలు ప్రభు త్వంపై, విద్యుత్ శాఖ అధికారులపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేప థ్యంలో మేం నిరంతరం పనిచేస్తున్నా.. మాపై ఎందుకిలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ విద్యుత్ శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని మేడ్చల్, కొంపల్లి, హబ్సీగూడ, బోడుప్పల్, శేరిలింగంపల్లి ప్రాంతాలతో పాటు నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఆజామాబాద్ తదితర ప్రాంతాల్లో తరుచూ విద్యుత్ సరఫరా నిలచిపోతుంది.