అందరూ అద్భుతంగా బతకాలని మా నినాదం
ప్రజలు ఉన్నత శిఖరాలకు చేరితే సంక్షేమ పథకాలు అడగరు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూన్ 16 (విజయక్రాంతి): అందరూ అద్భుతంగా బతకాలి అన్నదే మా నినాదం అని ప్రజలు ఉన్నత శిఖరాలకు చేరినప్పుడు సంక్షేమ పథకాలు అడిగే పరిస్థితులు ఉండవని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్వాడ మండలానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థికంగా బలహీన వర్గాల కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆడబిడ్డల వివాహాలకు సహాయం చేయడం ద్వారా సమాజంలో సమానత్వం తీసుకురావడమే ఈ పథకాల యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు పేద కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని ఆయన సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం నిజమైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు కృషి చేయాలని కూడా ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి. మహేందర్, నాయకులు యాదిరెడ్డి, హన్వాడ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నవనీత, నాయకులు టంకర కృష్ణయ్య యాదవ్, జె. వెంకటయ్య, సర్పంచులు బొట్టు శ్రీను, దీప్తి రఘురాం గౌడ్, సత్యం మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామకృష్ణ, గ్రామ అధ్యక్షులు చెన్నయ్య, రాములు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






