calender_icon.png 11 December, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లు పార్లమెంట్‌లో పెట్టకుండా వస్తే ఖబడ్దార్

11-12-2025 12:07:42 AM

బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్

ముషీరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టకుండా వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని, ఎంపీలారా ఖబర్దార్ అని బీసీ పొలిటికల్ ఫ్రంట్ హెచ్చరించింది.  ఈ మేరకు బుధవారం చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేసిన జరిగిన మీడియా సమావేశంలో పొలిటికల్ ఫ్రంట్ ఛైర్మెన్ బాలగోని బాలరాజ్ గౌడ్, ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్, రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్ లతో కలసి మాట్లాడుతూ  పార్లమెంట్ సమావేశాలు ప్రారంభ మై నేటికి 10 రోజులు కావస్తున్న 42 శాతం బీసీ రిజర్వేషన్స్ బిల్లుపై తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యు లు ఎందుకు నోరుమేదపడం లేదని, రిజర్వేషన్ల పై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

రెండు సంవత్సరాల విజయోత్సవాల మీద తెలంగాణ రైజింగ్ సమ్మిట్ మీద ఉన్న చిత్తశుద్ధి బీసీ రిజర్వేషన్ల మీద ఎందుకు లేదని ఇప్పటికైన అఖిలపక్ష సమావేశం నిర్వహించి డిల్లీకి తీసుకెళ్ళాలిసి ఉన్నపటికీ ఎలాంటి కార్యాచరణ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మం త్రులు ఎందుకు మౌనం వహిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ల తోనీ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలేనా అని విమర్శించారు.

బీసీ రిజర్వేషన్లు అమలు చేసి దేశానికి రోల్ మోడల్ అన్న ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికలకు మంగళం పాడి అభివృద్ధి పేరు తో నాటకాలు ఆడుతున్నారన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టీ వెంటనే 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. బీసీ కుల వృత్తులను ఆధునీకరణ కోసం బీసీ సబ్ ప్లాన్ కింద లక్షా 50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్, రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, బైరూ శేఖర్, ఎలికట్టె విజయ్ కుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్, బోయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయ గోపి, ఎంబీసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు బడే సాబ్, సిటీ సెక్రటరీ పిల్లి శంకర్, గంగపుత్ర సిటీ వైస్ ప్రెసిడెంట్ గాలి సత్యనారాయణ,గంగపుత్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు సురేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.