calender_icon.png 11 December, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు ఇచ్చేవరకు బీసీ ఉద్యమం

11-12-2025 12:09:27 AM

  1. జాతీయ సెమినార్‌లో పార్లమెంట్ సభ్యుల డిమాండ్
  2. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు మోడీతోనే సాధ్యం
  3. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి 
  4. రెండు లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రకటించాలి
  5. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చేవరకు బీసీ ఉద్యమాన్ని కొనసాగించాలని వివిధ పార్టీల 12 పార్లమెంట్ సభ్యులు బీసీలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ఆంధ్రభవన్ అంబేద్కర్ ఢిల్లీలోని ఆడిటోరియంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యం లో బీసీల హక్కులపై జాతీయ సెమినార్ జరిగింది.

వివిధ రాష్ట్రాల నుంచి మేధావులు, ఉద్యమకారులు, బీసీ నాయకులు హాజరయ్యారు. ఈ సభకు తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ అధ్యక్షత వహించగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణా ల అజ య్ కుమార్ సమన్వయం చేశారు. పార్లమెం ట్ సభ్యులు నాగరాజు, వద్దిరాజు రవిచంద్ర, అంబిక, లక్ష్మీనారాయణ, బీద మస్తాన్ రావు, పాక సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు ప్రసంగిస్తూ జనగణనలో కుల గణన చేపట్టాలని నిర్ణయించినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు రాజ్యాంగ బద్ధమైన హక్కు లు ఇతర డిమాండ్లు ప్రధాన మోడీ ద్వారానే సాధ్యమన్నారు. కుల గణన లెక్కలు వచ్చిన తర్వాత విద్యా ఉద్యోగా, ఆర్థిక, రాజకీయ రంగాలలో బీసీల వాటా బీసీలకు లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ప్రపంచం లోనే భారతదేశం అగ్ర దేశం గా అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో భవిష్యత్తులో బీసీలకు మంచి రోజులు వస్తాయన్నారు. సమా వేశం ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. చరిత్రలో తొలిసారిగా జనగణలో కులగణన చేయాలని కేంద్ర ప్రభు త్వం నిర్ణయించినందుకు ప్రధానమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలన్నారు.

కేంద్రంలో బీసీలకు ప్రతేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి 2 లక్షల కోట్లతో ప్రతేక అభివృద్ధి పథకం ప్రకటించాలి. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 25 శాతం నుం చి 50 శాతం పెంచాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాల న్నారు. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలన్నారు. బీసీల విద్య- ఉద్యోగ రిజర్వేషన్లపై యున్న క్రిమిలేయర్‌ను తొలగించాలన్నారు. బీసీలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హై కోర్టు సుప్రీంకోర్టు జడ్జిల నియమాకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్నారు.

ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను బీసీలకు జనాభా ప్రకారం పెంచాలన్నారు. జాతీయస్థాయిలో బీసీలకు ప్రత్యేక నవోదయ పాఠశాలలు ప్రతి జిల్లాకు రెండు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో బీసీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లో స్కీంను ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమును అమలు చేయాలన్నా రు. బీసీలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి బీసీ సబ్ ప్లాన్ పెట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లాగా బీసీలకు కూడా ఒక యాక్ట్ పెట్టాలన్నారు.

ఈ మహా సభలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, ఐక్యవేదిక అధ్యక్షుడు జి. అనంతయ్య, భీం రాజ్, గంగాపురం పద్మ అనురాధ గౌడ్, టి. రాజకుమార్, ఆది మల్లేశం, మనోజ్ గౌడ్, శ్రీమన్, జక్కన్ సం జయ్, శ్రీనివాస్, శివకుమార్ యాదవ్, వేణు యాదవ్, కిషోర్, లక్ష్మీప్రసన్న, ప్రియాంక, స్వరూప, పద్మా, పరశురాం, చండిక గౌడ, వసంత గౌడ్, రాజకుమారి తదితరులు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.