12 July, 2026 | 8:29 AM

తరచుగా నోరు పొడిబారుతుంటే..

06-05-2024 12:00 AM

మన శరీరంలో నీటి శాతం తగ్గిపోతే దాహం వేసి నోరు తడి ఆరిపోతుంది. కానీ, చాలా మంది నీళ్లు తాగిన తర్వాత కూడా మళ్లీ మళ్లీ గొంతు పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నోరు చాలా పొడిగా మారినట్లయితే, అది స్ట్రోక్, డయాబెటిస్ లేదా అల్జీమర్స్ సంకేతం కావొచ్చు. కొన్నిసార్లు నోరు పొడిబారడం అనే లక్షణం హీవ్ లేదా స్జోగ్రెన్స్ సిండ్రోమ్ వంటి ఇమ్యూనిటీని దెబ్బతీసే వ్యాధులకు కూడా సంకేతం కావచ్చని డాక్టర్లు అంటున్నారు. తరచూ ఇలా జరిగితే నిర్లక్ష్యం వహించకూడదు.  

నోరు ఎండిపోయినప్పుడు రకరకాల సూక్ష్మ క్రిములు చేరుతూంటాయి. తడిగా ఉన్నప్పటికంటే పొడిబారినప్పుడు ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది. నోటిలో ఊరే లాలాజలం సాధారణంగా మననోటిలోని హాని కలిగించే అనేక రకాల క్రిములను సంహరిస్తుంది.  తినే ఆహారంలో వుండే హాని కలిగించే క్రిములు, లాలాజలంలోని ఎంజైములు, మేలు చేసే బాక్టీరియా వంటి వాటితో తిన్న ఆహారాన్ని మొదటి దశలో జీర్ణం చేస్తాయి. తినే ఆహార జీర్ణక్రియలో మొదటి దశ నోటిలోని లాలాజలంతోనే జరుగుతుంది.

 డ్రై మౌత్ కేవలం ఒక సాధారణ ఆరోగ్య సమస్య మాత్రమే, అయితే కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది.

సాధారణ లక్షణాలు 

* నోటి లోపల జిగటగా అనిపించడం 

* శ్వాస నుంచి వాసన రావడం 

* మాట్లాడటంలో ఇబ్బంది, నమలడం, వేగంగా మింగడం

* గొంతులో ఏదైనా ఇరుక్కుపోవడం

* పొడి నాలుక

* రుచిలో తేడా రావటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 

ఇవే లక్షణాలు ధీర్ఘ కాలంగా కనిపిస్తూ ఉంటే మాత్రం ఇంటి చిట్కాలు, గృహవైద్యాలు ఆపేసి డాక్టర్ ని సంప్రదించాలి.