13 August, 2026 | 3:42 AM

సమస్యలు పరిష్కరించకుంటే ఉధృత ఉద్యమం

13-08-2026 01:38 AM

కాజీపేట, ఆగస్టు 12 (విజయక్రాంతి): దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాలుగు దశల పోరాట కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రెండవ దశ పోరాట కార్యక్రమంలో భాగంగా కాజీపేట మండల తహసిల్దార్ జీ.రమేష్ ద్వారా ముఖ్యమంత్రికి మెమోరాండం సమర్పించారు.

అనంతరం యుఎస్పీసీ నాయకులు మాట్లాడుతూ పిఆర్సి గడువు ముగిసి మూడు సంవత్సరాలైనా అమలు చేయడం లేదని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆరు డి.ఎ లు పెండింగ్లో ఉన్నాయని, ఉపాధ్యాయ ఉద్యోగుల, పెన్షనర్ల కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయడం లేదని, హెల్త్ కార్డులు సక్రమంగా అమలు చేయకపోవడం, ఆశాస్త్రీయంగా ఉన్న 25 జీవో సవరించాలని, పర్యవేక్షకు పోస్టులు భర్తీ చేయాలని, కేజీబీవీ, మోడల్,గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని అనేకమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 

ఇప్పటికైనా ప్రభుత్వం స్పం దించి ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, లేనియెడల ఈనెల 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29వ తేదీన హైదరాబాదులో మహా ధర్నా నిర్వహించనున్నామని, అప్పటికి సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యుఎస్పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు  సిహెచ్.రవీందర్ రాజు, జి. ఉప్పలయ్య, కే. శ్రీనివాస్, ఎస్.సుమ, సిహెచ్. బాబురావు, ప్రధానోపాధ్యాయులు ఎన్‌ఎంఎం.స్వామి, ఎం. ఫ్రాన్సిస్, ఎండి.మక్బుల్ హుస్సేన్,యుఎస్పిసి మండల నాయకులు మండల బాధ్యులు టి. తావు, శ్రీనివాస్, హరీష్, శ్రీనివాస్, సీనియర్ కార్యకర్తలు బి.రాజగోపాల్, డి. మహానంద రెడ్డి, ప్రమోద్, మునవర్ హుస్సేన్, బ్రహ్మచారి, ఎన్.రాజు, టి. రాంగోపాల్, తాసిల్దార్ ఆఫీస్ సిబ్బంది తదితరులున్నారు.