9 May, 2026 | 6:04 AM

ఆగస్టు 15 లోపు హామీలు అమలుచేస్తే రాజీనామా చేస్తా

25-04-2024 02:52 AM

బస్తీ మే సవాల్

l మళ్లీ ఉప ఎన్నికల్లో కూడా పోటీచేయను

l మాఫీ చేయకపోతే సీఎంగా రాజీనామా చేస్తవా?

l ముఖ్యమంత్రికి మాజీ మంత్రి హరీశ్ సవాల్ 

ఎకరానికి రూ.15 వేలు చొప్పున చెల్లిస్తామని ఎన్నికలో హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ఎందుకు అమలు చేయడం లేదు? వానకాలం పంటలకు రైతుబంధు ఎంత ఇస్తారు? అసలు ఇస్తారా.. ఇవ్వరా?’ అని ప్రశ్నించారు. ‘ ధాన్యానికి బోనస్ ఏది? వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఎప్పుడిస్తారు? చేయూత పథకంలో రూ.4 వేల పెన్షన్ ఎందుకివ్వటంలేదు? నెలకు రూ.2 వేల చొప్పున 5 నెలలకుగాను ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.10 వేలు బాకీ ఉన్నది.

నిరుద్యోగ భృతి నెలకు రూ.4 వేలు ఇస్తామన్నారు. ఐదు నెలల గడిచినా ఇవ్వలేదు. హామీలను గుర్తు చేస్తే ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాణ త్యాగాలకు సిద్ధమై ప్రత్యేక రాష్ట్రం సాధించుకొన్నామని, బీఆర్‌ఎస్ నేతలకు పదవులు కొత్త కాదని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారని తెలిసి ఆ పార్టీ నేతలు కొత్త నాటకం అడుతున్నారని ఆరోపించారు.  

నామా చేతిలో కాంగ్రెస్ చిత్తు

ఖమ్మం లోక్‌సభ స్థానంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావు గెలుపు తధ్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యర్థిని ప్రకటించుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ఉన్నదని ఎద్దేవా చేశారు. ఖమ్మం నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యాకర్తల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఖమ్మంలో కాంగ్రెస్ గెలిచినా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని, ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరారు.

కార్యాకర్తలే బీఆర్‌ఎస్ బలం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో తిట్ల పురాణం, ముఠా రాజకీయం తప్ప ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఊడిగం చేయడం మానాలని కమ్యూనిస్టు పార్టీలకు సూచించారు. కాగా, ఖమ్మంలో హరీశ్‌రావు హెలికాప్టర్‌ను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. తనిఖీల్లో ఎటువంటి జప్తు చేయాల్సిన వస్తువులు లభించలేదని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సత్యనారాయణ తెలిపారు.