03-12-2025 12:00:00 AM
గుజరాత్‌కు ఇచ్చేవన్ని.. రాష్ట్రానికి ఇవ్వాల్సిందే
రాష్ట్రాభివృద్ధికి ప్రధానమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తాం
ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ చీర చేరేలా చూడాలి
పార్టీ బాధ్యత గొప్పది.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు
డీసీసీ, పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వాన్ని ఎన్నిసార్లయినా కలుస్తామని.. ఇస్తా వా? చస్తావా అని ప్రధానమంత్రిని నిలదీస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫ్యూచ ర్ సిటీకి నిధులు ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీని అడుగుతామని, నిధులు మంజూ రు చేయకుంటే బీజేపీని రాష్ట్రంలో బొందపెడుతామని, ఆ పార్టీని లేకుండా చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రాభివృద్ధికి నిధుల కోసం విజ్ఞప్తి చేయడం మన బాధ్యత అని, ఇవ్వకపోతే పోరాడే హక్కు కూడా మనకు ఉందని సీఎం స్పష్టం చేశారు. గుజరాత్‌కు ఇచ్చేవన్ని తెలంగాణకు ఇవ్వాలని బుధవారం సీఎం మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేం ద్రం నుంచి నిధులను ఒకటికి వందసార్లు అడుగుతాని, ఒకటికి 50 సార్లు ఢిల్లీ వెళ్తామ న్నారు.
మంగళవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన డీసీసీ అధ్యక్షులు, పీసీసీ కార్యవర్గం సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, మం త్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, , సీతక్క, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శలు విశ్వనాథన్, సచిన్ సావంత్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,డీసీసీ అధ్యక్షులు, పార్టీ నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
మన ప్రభుత్వం అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించాలని సూచించారు. ఇందిరమ్మ చీరల పింపి ణీతో మహిళలు సంతోషంగా ఉన్నారని , కోటి చీరలను ఆడబిడ్డలకు సారెగా అందిస్తున్నామన్నారు.
ప్రతీ ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత డీసీసీ అధ్యక్షులదేనని, గ్రామాల వారీగా సమన్వయం చేసుకుంటూ పంపిణీ పూర్తి చేయాలన్నారు. డిసెంబర్‌లో గా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరలు, మార్చి నెలలో పట్టణ ప్రాంతాల్లో మహిళలకు 35 లక్షల చీరలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
కేసులతో భయపడేది లేదు..
దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని సీఎం తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో పని చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవని, ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందిని మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు ఒక పత్రిక ఉండాలని నేషనల్ హెరాల్డ్ పత్రికను పునరుద్ధరించే ప్రక్రియను చేపట్టారని వివరించారు. పత్రికను తిరిగి నడిపించాలం టే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా కొంత మంది కాం గ్రెస్ నాయకులను తీసుకున్నారని చెప్పారు.
షేర్ క్యాపిటల్‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారన్నారు. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి సంబంధించినది కాదని సీఎం వివరించారు. ఎవరు కూడా జేబులో ఒక్క రూపా యి వేసుకోలేదని, ఆస్తులన్ని నెహ్రూవేనని తెలిపారు. వారసత్వంగా ఉన్న కాం గ్రెస్ పార్టీ పత్రికను నడపాలని ప్రయత్నిస్తే మనీలాండరింగ్ కేసులు పెట్టి మానసికంగా సోనియా, రాహుల్‌గాంధీలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఓట్ల చోరీ ప్రచారాన్ని అడ్డుకోవాలనే మళ్లీ కేసులు పెట్టారని విమర్శించారు. ఈ అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధానికి లేఖ రాస్తున్నట్లు చెప్పారు.
2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ..
ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఈ నెల 8,9 తేదీల్లో నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 9న తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించ నున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆర్ధికంగా మరింతగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తుందన్నారు. 2034 నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నట్లు చెప్పారు.
ఓయూ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచస్థాయిలో నిలబెడుతామని, అందుకు ఎంత ఖర్చయినా నిధులు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. కోర్ అర్బన్‌లో సమస్యలను దృష్టిలో పెట్టుకుని క్యూర్ చేయాలని నిర్ణయించుకున్నామని, అందుకు కోర్ లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ బయటికి తరలిస్తున్నామని తెలిపారు. రీజనల్ రింగ్ లోపల ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ ( ప్యూర్ ) ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
రీజినల్ రింగ్‌రోడ్డు బయట రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ ( రేర్ ) ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేయబోతున్నామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణలో మరో నాలుగు ఎయిర్‌పోర్టులు , ఒక డ్రైపోర్టును ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్ బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నామన్నారు.
సంక్షోభం నుంచి సంక్షేమం వైపు..
సంక్షోభంలో మనకు రాష్ట్రాన్ని అప్పగిస్తే, సంక్షేమం వైపు ముందుకు నడిపిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జిల్లా అధ్యక్ష పదవి అనేది గొప్ప బాధ్యత అని, ఎవరైనా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రాహుల్‌గాంధీని ప్ర ధాని చేయాల్సిన బాధ్యత మ నందరిపైన ఉందన్నారు. రాజకీయాల్లో కాళ్ల ల్లో కట్టెలు పెట్టడం సహజమని, ఆది పెద్ద సమస్యగా భావించొద్దని సూచించారు. అం దరినీ సమన్వయం చేసు కుంటూ ముందుకు వెళ్లాలన్నారు.