03-12-2025 12:00:00 AM
మహబూబ్ నగర్ రూరల్, డిసెంబర్ 2: హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మంగళవారం టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ చేతులమీదుగా సంజీవ్ ముదిరాజ్ నియామకపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు.