ఇష్టపడి చదివితే లక్ష్యాన్ని చేరుకోగలం
శంకర్‌పల్లి, ఆగస్టు 13 (విజయక్రాంతి): విద్యార్థులు ఇష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని పర్వేద సర్పంచ్ సురేందర్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు షూస్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు అందించి వారి విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయడం జరుగుతుంది అన్నారు.
విద్యార్థులు కూడా బాగా చదివి గ్రామానికి వారి తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సునీత వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు నర్సింగ్ రావు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మంజుల, ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస చారి, నందు, విశ్వనాథ్, కవిత, కాంచన లక్ష్మి, బసవరాజు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






