హైలైఫ్ రేడియన్స్ స్పెషల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్
- 350 మందికిపైగా డిజైనర్ల కలెక్షన్స్‌తో మెగా షో
- హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం
హైదరాబాద్, ఆగస్టు 13(విజయక్రాంతి): భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యాషన్, లైఫ్‌స్టుల్ ఎగ్జిబిషన్ బ్రాండ్ ‘హైలైఫ్ ఎగ్జిబిషన్’, తన ప్రతిష్ఠాత్మకమైన ‘రేడియన్స్ స్పెషల్ ఆగస్టు’ ఎడిషన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన ‘రేడియన్స్ కలెక్షన్’ ప్రదర్శన ఆగస్టు 13, 14, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గల హెచ్‌ఐసీసీ, నోవాటెల్ వేదికగా వైభవంగా జరుగుతోంది.
రాబోయే పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న 350 మందికి పైగా ప్రముఖ డిజైనర్లు పాల్గొంటున్నారు.డిజైనర్ స్పెషల్స్, ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్, ట్రెండింగ్ ఫ్యాషన్స్, గ్లామర్, స్టైల్, లగ్జరీ ప్రొడక్ట్స్‌ను ఇక్కడ అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, మోడల్స్ , సెలబ్రిటీల సమక్షంలో ఈ మూడు రోజుల సుప్రసిద్ధ లైఫ్‌స్టుల్ ఈవెంట్ ప్రారంభమైంది.
హైలైఫ్ ఎగ్జిబిషన్స్ ఎండీ, సీఈఓ మిస్టర్ అబీ పి డొమినిక్ మాట్లాడుతూ ‘ఫెస్టివ్,లైఫ్‌స్టుల్, వెడ్డింగ్ షాపింగ్‌కు హైలైఫ్ ఎగ్జిబిషన్ దేశంలోనే అత్యంత ప్రసిద్ధ, అత్యంత ఆదరణ పొందిన మరియు అతిపెద్ద ఎగ్జిబిషన్ బ్రాండ్లలో ఒకటి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంతో మంది ఎదురుచూస్తున్న మా ‘రేడియన్స్ స్పెషల్ ఎగ్జిబిషన్’ను హెచ్‌ఐసీసీ, నోవాటెల్ వేదికగా ప్రదర్శిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
హైదరాబాద్‌లోని ఫ్యాషన్ ప్రియులకు సరికొత్త గ్లామర్, లగ్జరీ షాపింగ్ అనుభూతిని అందించడానికే ఈ రేడియన్స్ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకువచ్చాం. కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన సరికొత్త కలెక్షన్స్ ఇక్కడ ఒకే చోట అందుబాటులో ఉంచాం,’ అని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫ్యాషన్ ప్రియులు, పెళ్లికూతుళ్లు తమకు కావలసిన లేటెస్ట్ గ్లోబల్ ట్రెండ్స్, లగ్జరీ కలెక్షన్స్‌ను సొంతం చేసుకోవడానికి ఈ ఎగ్జిబిషన్ ఒక చక్కని వేదిక.






