12-07-2025 12:00:00 AM
శ్రీ కృష్ణ ప్రసాద్ స్కూల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు
ఖమ్మం, జులై 11( విజయ క్రాంతి):విద్యార్థులు ఆరోగ్యవంతంగా వుంటే ఏదైనా సాధించవచ్చు అని కృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్ చైర్ పర్సన్ నిష్ఠాశర్మ అన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కృష్ణ ప్రసాద్ మెమోరియల్ పాఠశాల విద్యార్థులకు శుక్రవారం స్కూల్ చైర్పర్సన్ నిష్టాశర్మ చొరవ తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మీరు ఆరోగ్యంగా ఉంటే జీవితంలో అనుకున్న ఏ పనైనా సాధించటానికి వీలుంటుందని అదేవిధంగా మంచిగా చదువుకొని ఈ పాఠశాలకు మీ తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.
ప్రముఖ వైద్యనిపుణులు డా. బి. స్వర్ణ కుమారి, డాక్టర్ కె. రాజశేఖర్ గౌడ్, డా.పరుచూరి వెంకటేశ్వర్రావు, డా. బి. సీతారాం, డాక్టర్ కె. శ్రీధర్ గౌడ్, డా. జి. భార్గవ్, డాక్టర్ ఎం. నాగేశ్వర్ రావు, డాక్టర్ సో హైల్, డాక్టర్ ఎన్. వేణు మాధవరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు న్యూరాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కంటి, దంత, గుండెకు సంబంధమైన వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.
విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం, కంటి సమస్యలు న్నట్లు గుర్తించిన విద్యార్థులందరికీ మరోసారి కంటి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు వెల్లడించారు. విద్యార్థులు ఎత్తుకు తగ్గట్టు బరువు ఉండాలని,ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు వైద్యులు సూచించారు.
పౌష్టికాహారం లోపం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు వైద్యులు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ ఏసీపీ సుశీల్ సింగ్, నర్సయ్య, ఆర్ ఐ కామరాజు, ప్రిన్సిపల్ శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు.