calender_icon.png 12 July, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు సమ్మె రోజును నో వర్క్, నోపేగా పరిగణించాలి..

12-07-2025 12:00:00 AM

ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి యండి నజీర్ అహ్మద్

ఇల్లెందు, జులై 11 (విజయక్రాంతి):సింగరేణి లొ ఈనెల 9 న జరిగిన దేశవ్యాపిత సమ్మెలో భాగంగా ఇల్లందు ఏరియా సింగరేణి సంస్థలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఔట్సోర్సింగ్ కార్మికులు, కన్విన్స్ డ్రైవర్స్ ఇతర విభాగాల్లో పని చేసె కార్మికులకు సమ్మె రోజును నో వర్క్, నో పే గా పరిగణించాలని ఎఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి యండి నజీర్ అహ్మద్ డిమాండ్ చేశారు.

ఎఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశం శుక్రవారం స్థానిక ఇల్లందులో విఠల్ రావు భవన్ లొ జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునియన్ బ్రాంచ్ కార్యదర్శి యండి నజీర్ అహ్మద్ పాల్గొని మాట్లాడుతూ.. పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం 7.3, సెక్షన్ కింద సార్వత్రిక సమ్మె నోటీసు ముందుగా ఇవ్వడం జరిగిందని సమ్మెకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేక చర్చలు జరగని కారణంగా సమ్మె అనివార్యమైనదని వారు అన్నారు.

సింగరేణిలొ అనేక దఫాలుగా ఆర్థికపరమైన ఉద్యోగ భద్రత కోసం పలు రకాల హక్కుల కోసం సమ్మె లు జరిగిన కాలంలో యజమాన్యం యూనియన్ల అభ్యర్థన మేరకు సమ్మె కాలాన్ని నో వర్క్ నో పే క్రింద ఉత్తర్వులు జారీ చేసిన సందర్భాలు ఉన్నవని వారు గుర్తు చేశారు.

కనుక 9 న జరిగిన దేశవాహిత సార్వత్రిక సమ్మె లో పాల్గొన్న కార్మికులందరికీ నో వర్క్ నో పే పరిగణించాలని ఆయన యాజమాన్యం ను డిమాండ్ చెశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దేవరకొండ శంకర్ ,బంధం నాగయ్య, జంగంపల్లి మోజేష్, బజార్, ఆంజనేయులు గౌడ్, వడ్లకొండ పోచయ్య తదితరులు పాల్గొన్నారు.