11-07-2025 11:36:42 PM
రామకృష్ణాపూర్,(విజయక్రాంతి): రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ క్రీడా మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అండర్ 13 బాలికల రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ లీగ్ పోటీలు గురువారంతో ముగిశాయి. 12 జట్టులతో నిర్వహించిన ఈ పోటీల్లో గురువారం ఫైనల్ కు ఖమ్మం, నిజామాబాద్ జట్లు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ లో నిజామాబాద్ విజేతగా నిలిచింది. ఖమ్మం జట్టు పోరాడి ఓడింది. విజేతగా నిలిచిన నిజామాబాద్ జట్టుకు మందమర్రి సింగరేణి జీఎం దేవేందర్, పుర కమిషనర్ గద్దె రాజు, పట్టణ ఎస్సై రాజశేఖర్ ల చేతుల మీదగా ట్రోఫీని అందజేశారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని పుర కమిషనర్ గద్దె రాజు అన్నారు.