4 July, 2026 | 10:13 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

రూ.50వేలు ఇస్తే ఇందిరమ్మ ఇల్లు రాస్తా..!

26-06-2025 12:00 AM
  1. కొత్తిమీర్ పంచాయతీ కార్యదర్శి నిర్వాకం ?
  2. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు

కుమ్రంభీం  ఆసిఫాబాద్, జూన్ 25 (విజ యక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇల్లు మంజూరులో క్షేత్రస్థాయిలో కొంతమంది డబ్బులకు కక్కు ర్తి పడి లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెళ్తుతున్నా యి.  దహేగాం మండలం కొత్తిమీర్ గ్రామపంచాయతీ పరిధిలో శ్యామల, రోజా, పద్మ, లలితకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇల్లు కమిటీ సభ్యులు ఇంటికి వచ్చి స్థలం చదును చేసుకోవాలని సూచించారు.

కొద్ది రోజుల తర్వాత రూ.50 వేల డబ్బులు ఇస్తేనే తమ పేరు రాస్తామని లేకుంటే వేరే వారికి మం జూరు చేస్తామని కార్యదర్శి చెప్పడంతో ఆం దోళన చెందిన బాధితులు బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు తెలి పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. డబ్బులు ఇస్తేనే ఇందిరమ్మ ఇండ్ల లిస్టు లో పేరు రాస్తామని లేకుంటే రాయమని కార్యదర్శి వంశీకృష్ణ మమ్మల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తమ న్యాయం చేయాలని కోరారు.