28 June, 2026 | 3:55 PM

Breaking News

లింగాపురం అంగన్వాడీ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం   •   పల్స్ పోలియో చుక్కలు వేసిన బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి   •   పీవీ నరసింహారావుకు ఘన నివాళి   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •  

కాలనీవాసులను బెదిరిస్తే తాటతీస్తా

25-06-2025 01:40 AM

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్

ఎల్బీనగర్, జూన్ 24 : టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కరించినందుకు కమలానగర్, ఆంధ్రకేసరి నగర్ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నా రు. మంగళవారం హయత్ నగర్ డివిజన్ లోని ఆయా కాలనీల్లో పర్యటించిన మధుయాష్కీగౌడ్ ను స్థానికులు సన్మానించి, కృతజ్ఞతలు తెలిపారు. సాహెబ్ నగర్ సర్వే నంబర్ 2 నుంచి 8 వరకు ఉన్న ఆయా కాలనీల్లో రిజిస్ట్రేషన్లపై కొన్ని నెలల కిందట విధించిన స్టేటస్ కో ఇటీవల ఇ బ్రహీంపట్నం ఆర్డీవో మూడు రోజుల క్రితం ఎత్తివేశారు.

ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. ప్రజలు తమ కష్టార్జితంతో కొనుక్కున్న స్థలాల ను 40 ఏళ్ల తర్వాత ఎవరో వచ్చి ఇది మా స్థలం అంటే.. ప్రజల మనోవేదన ఎలా ఉంటుందో తనకు తెలుసు అన్నారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ల నిలుపుదలపై స్టేటస్ కో ఎత్తివేయడంతో స మస్య పరిష్కారం అయ్యిందన్నారు. ఈ నేపథ్యంలో కొందరు నాయకులు ఈర్ష్యతో కాలనీవాసులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు.

కాలనీవాసులపై బెదిరింపులకు పా ల్పడితే తాటతీస్తానని, ఎల్బీనగర్ లో రౌడీయిజం నడవనివ్వనని హెచ్చరించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్, కాంగ్రెస్ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, నాయకులు పట్లోళ్ల మాధవరెడ్డి, భీమిడి రామకృష్ణారెడ్డి, కాలనీ అధ్యక్షుడు టీవీ రావు, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, కోశాధికారి దివాకర్, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు పూలమ్మ, మదన్ రెడ్డి, సారంగం, అడ్వకేట్ వెంకటేశ్వర్లు, వేణు గౌడ్ తదితరులుపాల్గొన్నారు.