28 June, 2026 | 2:51 PM

Breaking News

ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •  

ఆస్పత్రుల్లో వంటశాలల తనిఖీ

25-06-2025 01:38 AM

కమిషనర్ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచనల మేరకు నగరంలోని ఫుడ్ సేఫ్టీ అధికారులు తమ సర్కిల్ ప్రాంతంలోని ఆసుపత్రులలో ఉన్న వంటశాలలను మంగళ వారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆహార భద్రతా అధికారులు సుమారు 73 హాస్పిటల్ కిచెన్లను తనిఖీ చేశారు.

తనిఖీల సమయంలో 14 చోట్ల నమూనాలను సేకరించి, విశ్లేషణ కోసం హైదరాబాద్ నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీకి పంపారు. ఆహార పదార్థాల తయారీ, ఆహార పదార్థాల సరఫరా, వంటగది ప్రాంగణాన్ని సరిగ్గా నిర్వహించడంలో పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని హాస్పిటల్ కిచెన్ల యాజమాన్యాలకు సూచించారు.