calender_icon.png 23 February, 2026 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకుంఠిత దీక్షతో పనిచేస్తే ఆదరిస్తారు

23-02-2026 12:12:47 AM

అశ్వారావుపేట, ఫిబ్రవరి 22 (విజయ క్రాంతి) : ప్రజల ఆదరణ దక్కాలంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రతి ఒక్క వార్డ్ కౌన్సిలర్ అకుంఠిత దీక్షతో పనిచేసిన నాడే ఆదరిస్తారని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ఆదివారం మండలంలోని సత్య సాయి కళ్యాణ మండపంలో మున్నూ రు కాపు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబుతో ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎనిమిదో వార్డులో ఉన్న కమ్యూనిటీ భవనానికి రూ. పది లక్షల రూపాయలు ఎమ్మెల్యే గ్రాంట్ నుండి కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా హైస్కూల్లో విద్యార్థులకు ట్రైనింగ్ హాల్ కోసం రూ 25 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ ఫర్నిచర్ కోసం ఎమ్మెల్యే గ్రాంట్ నుండి రూ 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఫర్నిచర్ అందించడం జరుగుతుందన్నారు.

మున్నూ రు కాపు సామాజిక వర్గానికి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ కొందరు పని కట్టుకొని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడమే పనిగా పనిచేస్తున్నారని రాజకీయ విమర్శలు అనేవి ఎన్నికల వరకే ఉండాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ, వీరబాబు మున్నూరు కాపు వార్డు కౌన్సిలర్లు ఆరుగురికి, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వైస్ సర్పంచులకు శాలువా లతో సత్కరించారు.

కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులు కురిశెట్టి నాగబాబు నాయుడు, స్టేట్ బాపట్ల మురళి, మున్సిపల్ చైర్ పర్సన్, జూపల్లి శశికళ, వైస్ చైర్ పర్సన్ జూపల్లి రమేష్, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, తుమ్మ రాంబాబు, చిన్నంశెట్టి సత్యనారాయణ, పాశం రామారావు, తాడేపల్లి రవి, బండారు శ్రీనివాసరావు, కట్ట శ్రీను, కొల్లు నాగు, సురేష్,  విజయలక్ష్మి పాల్గొన్నారు.