28 July, 2026 | 1:32 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

ఆటో స్టాండ్ స్థలంలో అక్రమ కట్టడాలు తొలగించాలి ఐఎఫ్‌టీయూ..

13-06-2026 01:23 AM

ఇల్లెందు, జూన్ 12 (విజయక్రాంతి): ఇల్లెందు కొత్త బస్టాండ్ వద్ద ఆటో స్టాండ్ స్థలంలో అక్రమ కట్టడాలను తొలగించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి మున్సి పల్ చైర్పర్సన్, కమిషనర్కు వినతిపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు తోడేటి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కొక్కు సారంగపాణి మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ఆటో కార్మికులు ఈ స్థలంలో ఆటో స్టాండ్ నిర్వహిస్తూ వివిధ గ్రామాలకు రవాణా సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.

కొక్కు సారయ్య అనే వ్యక్తి ఆటో స్టాండ్ స్థలంలో అక్రమంగా షాపు ఏర్పాటు చేసుకోవడంతో కార్మికుల జీవనోపాధికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను తొలగించి ఆటో కార్మికుల హక్కుల ను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఇల్లందు ఎస్హెచ్వోకు కూడా వినతి పత్రం సమర్పించారు. ఐఎఫ్టియు ఇల్లందు శాఖ అధ్యక్షుడు పల్లి సుధాకర్, కార్యదర్శి డి. మోహన్రావు, నాయకులు కాంపాటి కిరణ్కుమార్, అజ్మీర రవికుమార్, బానోత్ శ్రీను, బానోత్ సకిందర్, మూడు నరేష్, జరుపుల లక్ష్మణ్, బానోత్ వీరన్న పాల్గొన్నారు.