calender_icon.png 9 May, 2025 | 1:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ పుష్కరాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ చంద్రశేఖర్ రెడ్డి

08-05-2025 08:29:00 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో 15 నుండి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి(Multi Zone IG Chandrasekhar Reddy) అన్నారు. గురువారం ఎస్పీ కిరణ్ ఖరే(SP Kiran Khare)తో కలిసి కాళేశ్వరంలో దేవాలయ పరిసర ప్రాంతాలు, పార్కింగ్‌ ఏరియాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తుల క్యూ లైన్ లు, పుష్కర ఘాట్ల వద్ద భద్రతా చర్యలను ఐజీ స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ... సరస్వతీ పుష్కరాలకు పెద్ద ఎత్తున తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల నుండి భక్తులు హాజరువుతారని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బంది చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అంతకుముందు కాళేశ్వర ముక్తేశ్వర  స్వామిని దర్శించుకున్న ఐజీకి దేవాలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వేముల శ్రీనివాస్, కాటారం, భూపాలపల్లి, డీఎస్పీలు రామ్ మోహన్ రెడ్డి, సంపత్ రావు, కాటారం సబ్ కలెక్టర్ మయాంక సింగ్, మహాదేవ్ పూర్ సీఐ రాంచందర్ రావు, కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి, జిల్లా పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.