08-05-2025 08:36:26 PM
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు..
మంచిర్యాల (విజయక్రాంతి): ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ని విజయవంతం చేసిన భారత ఆర్మీకి అభినందనలు అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు(Former MLA Diwakar Rao) అన్నారు. గురువారం భారత ఆర్మీకి శుభాకాంక్షలు తెలిపిన అందరూ మాట్లాడారు. పహల్గాం దాడికి ప్రతికార చర్యలలో పాకిస్థాన్ ఉగ్రవాదుల స్థావరాల మీద భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కి మద్దతుగా, ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న త్రివిధ దళాలకి బీఆర్ఎస్ పార్టీ, జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలుపుతున్నామన్నారు. అనంతరం పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.