calender_icon.png 9 May, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకును ఢీకొట్టిన ఇసుక లారీ: ఒకరి మృతి

08-05-2025 08:16:34 PM

కాటారం (విజయక్రాంతి): ద్విచక్రహానాన్ని ఇసుక లారీ ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చింతకాని క్రాస్ వద్ద గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం... ధన్వాడ గ్రామానికి చెందిన తులసగారి రాజలింగు(59) వ్యవసాయం పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గురువారం వ్యక్తిగత పనుల నిమిత్తం కొత్తపల్లికి వెళ్ళాడు. పనులు ముగించుకొని కాటారం వైపు తిరుగు పయనమయ్యాడు.

ఈ క్రమంలో చింతకాని మూలమలుపు వద్ద రాజలింగు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న ఇసుక లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజలింగు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ పై కాటారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.