2 June, 2026 | 1:58 AM

ఐఐటీ అడ్వాన్స్‌డ్- ఫలితాలలో అల్ఫోర్స్ హవా

02-06-2026 01:13 AM

ప్రతిభ చూపిన విద్యార్థులు

కరీంనగర్, జూన్ 1(విజయక్రాంతి): ఐఐటీ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలలో అల్ఫోర్స్ విద్యార్థులు వివిధ క్యాటగిరీలలో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచి అద్భుత ర్యాంకులు సాధించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా సంస్థలకు చెందిన కె. ప్రజ్ఞాన్ దీపక్ 75వ ర్యాంకు సాధించగా, సీహెచ్ లక్ష్మీహాసిని 400, ఎన్. రత్నప్రకాశ్ 497, బి. లిఖిత్ సాయి 785, ఎమ్. వశిష్ఠ 800, బి. స్పందన 954, కె. ధనుష్ 1294, ఎమ్. జోహన్ 1400, పటేల్ అక్షయ 1488, సీహెచ్ అభిరామ్ రావు 1618, ఎ. సత్యవర్ధన్ 1678 ర్యాంకులు సాధించి ‘అల్ఫోర్స్’ ఖ్యాతిని మరింత పెంచారని తెలిపారు.

అలాగే వెయ్యి లోపు 6 గు రు, రెండు వేల లోపు 11 మంది, మూడు వేలు లోపు 19 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారన్నారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అహర్నిశలు కృషి ఇంతటి ఘనవిజయానికి తోడ్పడ్డాయన్నారు. ఎప్సెట్-2026లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ర్యాంకులు సాధించారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ప్రప్రధమంగా ఐఐటీ కోచిం గ్ అందించి అనేక మంది విధ్యార్థులు ప్రతిష్టాత్మక ఐఐటీలలో సీట్లు సాధించే విధంగా తీర్చి దిద్దిన మొదటి, ఏకైక విద్యాసంస్థ అల్ఫోర్స్ అని అన్నారు.

ప్రతీ సంవత్సరం అల్ఫోర్స్ అందించిన అద్భుతమైన ఐఐటీ కోచింగ్ ద్వారా ఐఐ టీలలో సీట్లు సాధించిన విద్యార్థుల సంఖ్య అ నూహ్యంగా పెరగడం విశేషమని తెలిపారు. రాబోయే నీట్-2026 ఫలితాలలో కూడా మా అల్ఫోర్స్ చిన్నారులు అద్భుత ర్యాంకులు సాధిస్తారని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ర్యాం కులు సాధించిన విద్యార్థులను, ఘనవిజయానికి తోడ్పడిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బం దిని నరేందర్ రెడ్డి అభినందించారు.