calender_icon.png 14 February, 2026 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామప్ప ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా ఐలయ్య ప్రమాణ స్వీకారం

14-02-2026 12:16:15 AM

వెంకటాపూర్, ఫిబ్రవరి13 (విజయక్రాంతి):మండలంలోని ప్రసిద్ధ గాంచిన రామప్ప ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మిల్కూరి ఐలయ్య శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మిల్కూరి ఐలయ్య మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన మంత్రి సీతక్క, జిల్లా అధ్యక్షులు అశోక్ మరియు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

రాబోయే మహాశివరాత్రి ఉత్సవాలను భక్తులకు సౌకర్యవంతంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు. అనంతరం నాయకులు ఐలయ్య ను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్లు, మండల స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.