1 July, 2026 | 8:00 PM

Breaking News

సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •  

భారీగా నల్ల బెల్లం పట్టివేత

13-06-2025 11:29 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): అక్రమంగా లేలాండ్ మినీ ట్రాలీలో  రవాణా చేస్తున్న 45 బస్తాల నల్లబెల్లం, 5 బస్తాల పటిక ను మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి బెల్లం, పటిక, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నెల్లికుదురు ఎస్సై చిర్రా రమేష్ బాబు తెలిపారు. కర్ణాటకలోని బీదర్ నుంచి మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో నాటు సారా తయారీకి వినియోగించే బెల్లం, పటిక ను తెచ్చి విక్రయిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు నెల్లికుదురు క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, బెల్లం, పటిక అక్రమ రవాణా దందా వెలుగు చూసిందన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన ఐదుగురు పారిపోయారని, పట్టుకున్న బెల్లం, పటిక విలువ 2.50 లక్షలు ఉంటుందన్నారు.