చలివేంద్రం ప్రారంభం
01-04-2025 01:47 AM
మేడ్చల్, మార్చి 31 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని అక్షయ సమృద్ధి ఫౌండేషన్ చైర్మన్ ముల్లంగిరి శ్రీహరి చారి ప్రారంభించారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడూ మంచినీరు, మజ్జిగ అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు పాతూరి సుధాకర్ రెడ్డి, శ్రీపాద వల్లభ ట్రస్టు చైర్మన్ తాళ్లపల్లి రమేష్ గుప్తా, బి ఆర్ ఎస్ నాయకుడు సానాల విష్ణు చారి, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.






