3 April, 2026 | 12:47 PM

సిమ్లా మసీదు అక్రమ కట్టడం

06-09-2024 12:00 AM
  1. హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్ మంత్రి వ్యాఖ్యలు 
  2. ఖండించిన సొంతపార్టీ 

సిమ్లా (హిమాచల్ ప్రదేశ్), సెప్టెంబర్ 5: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత అనిరుధ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గురువారం సమావేశాల్లో అనిరుధ్ మాట్లాడుతూ.. సిమ్లాలోని సౌంజౌలి మార్కెట్‌లోని మసీదు నిర్మాణం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారని, ముందుగా మసీదులో ఒక ఫ్లోర్‌ను నిర్మించి తర్వాత ఐదు అంతస్తులకు పెంచారని ఆరోపించారు.

‘సంజౌలీ మార్కెట్‌లో దొంగతనాలు పెరిగిపోయాయని, కొందరు లవ్ జీహాద్ పేరిట దాడులకు దిగుతున్నారని, మహిళలు ఆ ప్రాంతంలో ఒంటరిగా వెళ్లడం కష్టంగా మారిపోయింది’ అని అనిరుధ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి అనిరుధ్ వ్యాఖ్యలను రాష్ట్ర సీఎం, సొంతపార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండి ంచారు. సీఎం సుఖ్విందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని మతాలను గౌరవిస్తామని, మంత్రులు, ఎమ్మెల్యేలు అనవసర విషయాలపై రాద్దాంతం చేయవద్దని సూచించారు.