29 August, 2026 | 3:50 AM

అక్రమ నిర్మాణం సీజ్

29-08-2026 12:57 AM

మేడ్చల్, ఆగస్టు 28 (విజయక్రాంతి): మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్ల పోచంపల్లి డివిజన్లో ఒక అక్రమ నిర్మాణాన్ని సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు సీజ్ చేశారు. కండ్లకోయ ప్రధాన రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా నాలుగు అంతస్తుల భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పంది ంచారు.

మున్సిపల్ చట్టం 461 ఏ కింద ఈ భవనాన్ని సీజ్ చేశారు. ఈ భవనం మొత్తం నిబంధనలకు విరుద్ధంగానే నిర్మిస్తున్నారు. నాలుగు అంతస్తులకు అనుమతి లేకపోవడమే గాక సెట్ బ్యాక్ కూడా లేదు. మేడ్చల్ సర్కిల్ పరిధిలో మరికొన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం సమీపంలో అనుమతి లేకుండా దుకాణ సముదాయాలు నిర్మించారని, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.